Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగులకు శుభవార్త ప్రకటించిన మైక్రోసాఫ్ట్!

తమ ఉద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శుభవార్తను అందించింది. సంరక్షకుడి సెలవు కింది నాలుగు వారాల పెయిడ్ లీవ్ ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో ఎవరి ఆరోగ్య పరిస్థితి అయినా విషమంగా ఉంటే... వారి వెన్నంటి ఉండేందుకు ఈ సెలవులను ప్రకటించింది. ఈ సెలవు సమయంలో పూర్తి వేతనాన్ని చెల్లించనుంది. కుటుంబ సభ్యుల జాబితాలో జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం, తోబుట్టువులు, అత్తామామలు, తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మలు వంటి వారిని చేర్చింది. గత సంవత్సరం కూడా ప్రసూతి సెలవుల కింద మహిళలకు 26 వారాల సెలవును మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. పురుష ఉద్యోగులు కూడా ఆరు వారాల పితృత్వ సెలవును పెట్టుకోవచ్చని తెలిపింది. 

More Telugu News